Intlo Aakukuralanu Penchdam Ela

ఇంట్లో ఆకు కూరలను పెంచే విధానం

ఇంట్లో ఆకు కూరలను పెంచే విధానం

18*9 గ్రో బ్యాగ్స్‌లో ఇంట్లోనే ఆకు కూరలను పెంచుకోండి, పెంచుకోడానికి అవసరమైన పదార్థాలను intipanta.com లో కొనుగోలు చేయవచ్చు. ఆకు కూరలను పెంచడానికి మట్టి మిక్సింగ్ ప్రక్రియ, ఆకు కూరల విత్తనాలను ఎలా విత్తుకోవాలి అనే వివరాలు క్రింద చర్చించబడ్డాయి.

ఇంట్లో ఆకు కూరలను పెంచుకోడానికి అవసరమైన పదార్థాలు

  • 18*9 గ్రో బ్యాగ్
  • మట్టి
  • కోకోపీట్
  • ఇసుక
  • వర్మి కంపోస్ట్ / ఎరువు
  • వేప పొడి
  • ఆకు కూరల విత్తనాలు
  • గార్డెన్ వాటర్ స్ప్రేయర్

ఆకు కూరలను పెంచడానికి మట్టి మిక్సింగ్ ప్రక్రియ (leafy Vegetable Soil Mix )

ముందుగా మట్టి, కోకోపీట్, వర్మి కంపోస్ట్ లేదా ఎరువు మరియు వేప పొడిని కింద చూపిన మిశ్రమాలలో బాగా కలపండి.

  • 1 భాగం మట్టి
  • 1 భాగం కోకోపీట్
  • 1 భాగం వర్మి కంపోస్ట్ / ఎరువు
  • పిడికెడు వేప పొడి

ఇంట్లో ఆకు కూరలను పెంచే విధానం

ఇంట్లో ఆకు కూరలను పెంచే విధానం

  • మట్టిని కలిపిన తరువాత, ఈ మట్టిని 18 * 9 గ్రో బ్యాగ్ లో నింపండి
  • 18 * 9 గ్రో బ్యాగ్ లో ఆకు కూరలు పండించడం సులభం
  • మీరు కలుపుకున్న మట్టి మిశ్రమం 18*9 గ్రో బ్యాగ్ లో సగం వరకు నిండుతుంది
  • మట్టి మిశ్రమం విత్తే ముందు తడిగా ఉండాలి
  • గార్డెన్ వాటర్ స్ప్రేయర్ తో మిశ్రమని తడిగా చేయండి

ఇంట్లో ఆకు కూరలను పెంచే విధానం

ఆకు కూరగాయల విత్తనాలను ఎలా విత్తుకోవాలి

ఆకు కూరల విత్తనాలు చాల చిన్నగా ఉంటాయి, విత్తనాలను నేరుగా చల్లితే దగ్గరిగా పడే అవకాశాలు ఉంటాయి. ఇలా చల్లకుండా విత్తనాలలో ఒక్క పిడికెడు ఇసుక లేదా మట్టిని జోడించి విత్తనాలను చిలకరించండి. విత్తనాలను చల్లిన తరువాత 1/2 అంగుళాల మట్టితో కప్పండి. నేల తేమగా ఉంచండి. గార్డెన్ స్ప్రేయర్‌తో నీరు పోయాలి. 1 వారంలో మొలకాలు వస్తాయి.

ఆరు నుండి ఎనిమిది వారాల్లో మీరు కనీసం మూడు లేదా నాలుగు అంగుళాల పొడవైన ఆకులు ఉన్న మొక్క నుండి కోత ప్రారంభించవచ్చు.

ఇంట్లో ఆకు కూరలను పెంచే విధానం

intipanta.com లో మీకు అందుబాటులో ఉన్న ఆకూ కూరల విత్తనాలు

తోటకురా విత్తనాలు (Amaranthus Seeds)

మెంతికూర విత్తనాలు (Fenugreek Seeds)

కోతిమీరా విత్తనాలు (Coriander Seeds)

పాలకూర విత్తనాలు (Spinach Seeds)

ఎర్రా గోంగురా విత్తనాలు (Red Roselle Seeds)

తెల్ల గోంగురా విత్తనాలు (White Roselle Seeds)

చుక్క కూర విత్తనాలు (Green Sorrel)

మలబార్ బచ్చలికూర విత్తనాలు (Malabar Spinach)

గంగవల్లి కూర విత్తనాలు (Purslane)